Mahesh Babu: మీకు ఎప్పుడూ ఇదే పనా?: మహేశ్ బాబు చిరు కోపం... వీడియో ఇదిగో!

  • ఎయిర్ పోర్టులో మహేశ్ కామెడీ
  • 'ఆపు బాబూ...' అంటూ ఫొటో గ్రాఫర్ పై కోపం
  • వైరల్ అవుతున్న వీడియో
Mahesh Babu Gets Angry Over Photographer

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కామెడీని ఎంత బాగా పండించగలడో ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు నిరూపించాయి. అభిమానులతోనూ ఆయన అలాగే కనిపిస్తుంటారు. తాజాగా ఓ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అయింది. తనను పదేపదే ఫొటో తీస్తున్న ఓ అభిమానిపై చిరుకోపాన్ని నటిస్తూ, మహేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మహేశ్ కారు దిగి విమానాశ్రయంలోకి నడిచి వస్తున్నంత సేపూ ఓ వ్యక్తి ఫొటోలు తీస్తూనే ఉన్నాడు. దీంతో "ఆపమ్మా ఆపు... నీకు బోర్ కొట్టట్లేదా?... ఎప్పుడూ ఇదే పనా?" అంటూ తనదైన శైలిలో అనడంతో అక్కడున్న సిబ్బందితో పాటు సదరు ఫొటోగ్రాఫర్ కూడా పెద్దపెట్టున నవ్వాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

More Telugu News