తాజ్ మహల్ విజిటర్స్ బుక్ లో తన మనోభావాలు రాసిన ట్రంప్

24-02-2020 Mon 17:48
  • భారత్ లో ట్రంప్ తొలి పర్యటన
  • భార్య మెలానియాతో కలిసి తాజ్ మహల్ సందర్శన
  • తాజ్ అందాలకు మైమరిచిపోయిన ట్రంప్ దంపతులు
US President Donald Trump writes in visitors book at Taj Mahal

భారత్ లో తొలిసారి పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి తాజ్ మహల్ ను సందర్శించారు. అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆగ్రా పయనమయ్యారు. ఆగ్రాలో ట్రంప్ కు ఘనస్వాగతం లభించింది. ఆపై ట్రంప్, మెలానియా ప్రేమకు చిహ్నంగా పరిగణించే తాజ్ మహల్ అందాలు వీక్షించారు. ఈ సందర్భంగా అక్కడి విజిటర్స్ బుక్ లో ట్రంప్ ఇలా రాశారు... "తాజ్ మహల్ అద్భుతమైన అనుభూతులకు ప్రేరణ కలిగిస్తోంది. సుసంపన్నమైన, బహువిధ సౌందర్యభరితమైన భారత సంస్కృతిని చాటిచెప్పే అజరామరమైన కట్టడం తాజ్ మహల్. థాంక్యూ ఇండియా" అంటూ పేర్కొన్నారు.