disha act: మహారాష్ట్రలో దిశ చట్టం తెచ్చే దిశగా ప్రయత్నాలు

  • చట్టంపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ  ఏర్పాటు
  • వచ్చే నెల 30వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • ఇదివరకే ఆసక్తి వ్యక్తం చేసిన ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు  
Maharashtra to enact the Disha Act

అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు  21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని మహారాష్ట్రలోనూ తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్  తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని చెప్పారు. ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు నుంచి పూర్తి  వివరాలు కోరాయి.

More Telugu News