బాక్సర్ గా రంగంలోకి దిగిపోయిన వరుణ్ తేజ్

24-02-2020 Mon 13:07
  • బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్
  • 35 కోట్ల బడ్జెట్ తో సినిమా 
  •  కథానాయికగా 'సయీ మంజ్రేకర్' పరిచయం
Kiran Korrapati Movie

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం కొంతకాలంగా వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈ రోజున ఈ సినిమా షూటింగును మొదలెట్టనున్నారు. వైజాగులో ఈ సినిమా షూటింగును ఆరంభించనున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ వైజాగ్ చేరుకున్నాడు.

షూటింగును మొదలెడుతూనే విడుదల తేదీని ఖరారు చేసేయడం విశేషం. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అల్లు వెంకటేశ్ - సిద్ధూ ముద్ద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా 'సయీ మంజ్రేకర్' కనిపించనుంది. తెలుగులో ఈమెకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.