విమానం దిగగానే ట్రంప్‌కు హగ్‌ ఇచ్చిన మోదీ.. వీడియో ఇదిగో

24-02-2020 Mon 12:07
modi gives hug to trump
  • ముందుగా ట్రంప్‌తో కరచాలనం చేసి మాట్లాడిన మోదీ
  • మెలానియాకు కరచాలనం చేసిన ప్రధాని
  • కాసేపట్లో రోడ్‌ షో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హగ్ ఇచ్చారు. ట్రంప్ విమానంలోంచి దిగగానే స్వాగతం పలికి ఆలింగనం చేసుకుని, కరచాలనం చేశారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియాతో కూడా మోదీ కరచాలనం చేశారు.
                  వారికి స్వాగతం పలికిన అనంతరం ట్రంప్‌తో కలిసి నడుస్తూ ఎయిర్‌‌పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి వారిని మోదీ తీసుకొచ్చారు. కాసేపట్లో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదికయిన స్టేడియానికి వారు చేరుకోనున్నారు. ట్రంప్‌కు లక్షలాది మంది భారతీయులు స్వాగతం పలకనున్నారు.