Nani: విస్మయులను చేసే 'వి' సినిమా క్లైమాక్స్

  • నానీకి హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా ఇంద్రగంటి 
  • ఎవరూ ఊహించని రీతిలో క్లైమాక్స్ 
  • మార్చి 25వ తేదీన విడుదల   
V Movie

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి హిట్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరితో ఆయన చేసిన చిత్రాలు వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి. అలాంటి ఇంద్రగంటి ఈ ఇద్దరితో కలిసి 'వి' సినిమా చేశాడు. పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు.

హీరోగా దూసుకుపోతున్న నానీ, విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు. కానీ ఈ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచే విషయమే. మార్చి 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, నివేద థామస్ .. అదితీరావు నాయికలుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News