Rajamouli: ఇప్పుడు తెలుగులో కూడా స్నీక్ పీక్ తీసుకువచ్చే ధైర్యం చేశారు: రాజమౌళి

  • హిట్ సినిమా ప్రీరిలీజ్ వేడుక
  • ఫంక్షన్ కు విచ్చేసిన రాజమౌళి
  • విశ్వక్ సేన్, నానీలకు మరో హిట్ ఖాయమని వ్యాఖ్యలు
Rajamouli attends HIT movie Pre Release Event

నాని నిర్మాతగా రూపొందించిన చిత్రం హిట్ (హెచ్ఐటీ). విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి దర్శకుడు రాజమౌళి, రానా దగ్గుబాటి, అనుష్క, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, సినిమాలోని కీలక సన్నివేశాన్ని ముందే విడుదల చేయడాన్ని స్నీక్ పీక్ అంటారని, హాలీవుడ్ లో '2012' చిత్రంతో ఈ ట్రెండ్ మొదలైందని తెలిపారు. ఇప్పుడు హిట్ మూవీలోని కీలక సన్నివేశాన్ని స్నీక్ పీక్ గా విడుదల చేస్తుండడం మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డారు. ఈ హిట్ సినిమా ద్వారా తెలుగులోనూ స్నీక్ పీక్ తీసుకువచ్చే ధైర్యం చేశారని అభినందించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగా వచ్చాయని, విశ్వక్ సేన్, నానిలకు మరో హిట్ వచ్చినట్టేనని శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News