Robot: చేతులు శుభ్రం చేసుకోండి పిల్లలూ.. ఢిల్లీలోని గురుద్వారా స్కూళ్లలో సరికొత్తగా ‘పెపె’ రోబో

  • పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం ఏర్పాటుకు నిర్ణయం
  • సంక్రమిత వ్యాధుల నుంచి రక్షణకు తోడ్పతుందన్న గురుద్వారా నిర్వహణ కమిటీ
  • ఒక్కో రోబోకు ఏడు వేల రూపాయల ఖర్చు
robot pepe will be nudging school kids to wash hands

పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, సంక్రమిత వ్యాధుల నుంచి రక్షణకు తోడ్పడేలా చేసేందుకు ఢిల్లీలోని గురుద్వారా స్కూళ్లలో సరికొత్తగా మాట్లాడే రోబో ‘పెపె’ను ఏర్పాటు చేయనున్నారు. అమృత విద్యా పీఠం విశ్వవిద్యాలయం సాయంతో గ్లాస్గో వర్సిటీ రీసెర్చర్లు ఈ ‘పెపె’ రోబోను డెవలప్ చేశారు. ఈ రోబోలో మోషన్​ సెన్సర్లు, వాయిస్​ రికగ్నిషన్​ సెన్సర్లు ఉంటాయి. వాటి ముందు నుంచి వెళ్లినప్పుడు గుర్తించి.. చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్తాయి.

ఏడు వేల ఖర్చుతో..

ఢిల్లీలోని సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలోని కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో ఈ ‘పెపె’ రోబోను ఉపయోగించనున్నట్లు కమిటీ చీఫ్ మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. ‘‘రూ.7 వేల ఖరీదు చేసే ఈ మాట్లాడే రోబోను వాష్ రూమ్లోని వాష్ బేసిన్ దగ్గర గోడకు ఫిట్ చేస్తాం. పిల్లలు హ్యాండ్ వాషింగ్ స్టేషన్ ను దాటి వెళ్తున్నప్పుడు ఆ రోబో గుర్తిస్తుంది. పిల్లలూ హ్యాండ్స్ వాష్ చేసుకోండి అంటూ చెప్తుంది. ఇది ఆసక్తిగా ఉండటంతో పిల్లలు చేతులు శుభ్రం చేసుకుంటారు. పిల్లలకు పరిశుభ్రత అలవాటయ్యేందుకు ఇది తోడ్పడుతుంది..” అని ఆయన తెలిపారు.

More Telugu News