'రోజా వనం'.... హీరో అర్జున్ తో మొక్కలు నాటించిన రోజా

23-02-2020 Sun 19:49
Hero Arjun takes Roja Vanam challenge
  • 'గ్రీన్ ఇండియా చాలెంజ్' స్ఫూర్తిగా రోజా కొత్త కార్యక్రమం
  • 'రోజా వనం' పేరిట పర్యావరణ కార్యక్రమం
  • మూడు మొక్కలు నాటిన అర్జున్

తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. ఇది కూడా పర్యావరణ హిత కార్యక్రమమే. తాజాగా 'రోజా వనం' చాలెంజ్ లో భాగంగా సీనియర్ హీరో అర్జున్ మూడు మొక్కలు నాటారు. రోజా దగ్గరుండి మరీ అర్జున్ తో  మొక్కలు నాటించడం విశేషం అని చెప్పాలి. మొక్కలు నాటిన అనంతరం అర్జున్ మరో ముగ్గురిని నామినేట్ చేశారు. రోజా భర్త ఆర్కే సెల్వమణి, జగపతిబాబు, ఖుష్బూకు చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న రోజా సంకల్పం అభినందనీయం అని పేర్కొన్నారు.