Iran: టర్కీ, ఇరాన్​ సరిహద్దుల్లో భారీ భూకంపం

  • ఎనిమిది మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు
  • శిథిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయి ఉండొచ్చన్న అధికారులు
  • 5.7 తీవ్రతతో కంపించిన భూమి
  • కుప్పకూలిన భవనాలు.. రెండు దేశాల్లోనూ భారీగా ఆస్తినష్టం
8 Killed In Turkey After Earthquake Hits Iran Border

టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో ఆదివారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఇండ్లు, భవనాలు కూలిపోయాయి. టర్కీలో పరిధిలోని భూభాగంలో ఎనిమిది మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కూలిపోయిన ఇండ్లు, భవనాల కింద ఎంత మంది చిక్కుకుపోయారన్నది ఇంకా తేలలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, గాయపడినవారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు.

ఇరాన్ లో భూకంప కేంద్రం

టర్కీ సరిహద్దులకు పది కిలోమీటర్ల దూరంలో ఇరాన్ లోని హబాష్ ఓల్యా ప్రాంతంలో, ఉపరితలానికి ఆరు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అమెరికన్ జియాలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. దాని ప్రభావం ఇరు రాష్ట్రాలపైనా ఉందని తెలిపింది.

భారీగా నష్టం

అటు ఇరాన్ వైపు కూడా భారీగా నష్టం జరిగింది. వెస్ట్ అజర్ బైజాన్ ప్రాంతంలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని ఇరాన్ అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని సమాచారం అందిందని, భారీగా ఆస్తినష్టం జరిగిందని వెల్లడించారు.

More Telugu News