Aircraft: గోవాలో కూలిన మిగ్-29 యుద్ధ విమానం... తృటిలో తప్పించుకున్న పైలెట్

  • శిక్షణ పైలట్ సురక్షితం
  • ఉదయం 10.30కు ప్రమాదం
  • ఘనటపై విచారణకు ఆదేశం
Aircraft crashes in Goa pilot ejects safely

భారత నావికా దళానికి చెందిన మిగ్–29కె శిక్షణ విమానం ఆదివారం ఉదయం గోవా తీరంలోని అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపట్టాడని నావికా దళం ప్రకటించింది. ఈ విమానాన్ని పైలట్ల శిక్షణ కోసం వాడుతున్నారు. ఎప్పట్లానే ఆదివారం ఉదయం కూడా శిక్షణ కోసం బయల్దేరిన విమానం 10.30 గంటల సమయంలో సముద్రంలో కూలిపోయిందని నేవీ అధికారులు చెప్పారు.

అందులో ఉన్న పైలట్.. పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడని చెప్పారు. ప్రమాదానికి కారణం పైలట్ తప్పిదమా? లేక విమానం నిర్వహణ లోపమా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

More Telugu News