5 రోజుల దూడ పాలు ఇస్తున్న వైనం... ఉదయం లీటరు.. సాయంత్రం మరో లీటరు పాలు

Sat, Feb 22, 2020, 09:19 PM
 calf gives milk
  • నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కొత్తలోలం గ్రామంలో ఘటన
  • డైరీఫామ్‌లో జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే లేగదూడకు జన్మ
  • దూడ పొదుగు పెద్దది కావడాన్ని గమనించిన రైతు
  • ఆ పొదుగును పట్టుకుని చూడగా పాలు  
లోకంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కొత్తలోలం గ్రామంలో జరుగుతున్న ఓ  వింత ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే పాడిరైతుకు చెందిన డైరీఫామ్‌లో ఓ దూడ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే లేగదూడకు జన్మనిచ్చింది. ఇటీవల దూడ పొదుగు పెద్దది కావడాన్ని గమనించాడు రైతు. అనంతరం ఆ పొదుగును తడిమి చూడగా పాలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. హార్మోన్ల ప్రభావం వల్లే ఈ విధంగా జరుగుతుందని పశువైద్యాధికారులంటున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha