ap7am logo

జ్యువెలరీ వ్యాపారంలోకి క్రిస్ గేల్!

Sat, Feb 22, 2020, 05:09 PM
  • తన పేరిట స్పెషల్ ఎడిషన్ ఉంగరాలు విడుదల
  • ఉంగరాల ముందు భాగంలో క్రిస్ గేల్ రూపం ముద్రణ 
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను పోస్ట్ చేసిన క్రిస్ గేల్
ఆటతోనే కాకుండా తన లైఫ్ స్టయిల్ తోనూ ప్రత్యేకంగా నిలిచే వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. యూనివర్స్ బాస్ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న ఈ విధ్వంసకర బ్యాట్స్ మన్ ఇప్పుడు ఆ బ్రాండ్ నేమ్ తో జ్యువెలరీ వ్యాపారంలోకి దిగాడు. తన పేరుతో ముద్రించిన గోల్డ్ రింగ్స్ ను ప్రవేశ పెట్టాడు.

స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ ఉంగరాల ముందు భాగంలో క్రిస్ గేల్ ప్రతిబింబంతో పాటు అతని పేరు సూచించేలా ‘సీజీ’ అని క్యాపిటల్ లెటర్స్ తో ముద్రించారు. అలాగే, నాలుగు వైపులా యూనివర్స్ బాస్ అని రాసి ఉంది. రెండు కొనల్లో అతని జెర్సీ నంబర్ 333ని ముద్రించగా.. లోపలి భాగంలో గేల్ సంతకం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఉంగరాలను విడుదల చేసిన గేల్ వాటి ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ గోల్డ్ రింగ్ ఖరీదు ఎంతో చూడాలి.


Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement