కొయ్యబొమ్మల నేపథ్యంలో 'రాధాకృష్ణ'.. కీలక పాత్రలో లక్ష్మీ పార్వతి

Sat, Feb 22, 2020, 05:06 PM
Lakshmi Parvathi in Radhakrishna Movie
  • తెలుగు తెరకి మరో కొత్త దర్శకుడు 
  •  ముగింపు దశలో 'రాధాకృష్ణ' సినిమా
  • ముఖ్యమైన పాత్రలో సంపూ  
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న లక్ష్మీ పార్వతి త్వరలో తెరపై కనిపించనున్నారు. 'రాధాకృష్ణ' అనే ఒక సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సాగరిక- శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రసాద్ వర్మ పరిచయమవుతున్నాడు. నిర్మల్ కొయ్యబొమ్మల నేపథ్యంలో ఆయన ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

అనురాగ్ - ముస్కాన్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో లక్ష్మీ పార్వతి కనిపించనున్నారు. వినోదం - సందేశంతో కూడిన ఈ సినిమా, కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంపూర్ణేష్ బాబు .. కృష్ణభగవాన్ ..చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement