'అంధాదూన్' రీమేక్ పై దృష్టిపెట్టిన నితిన్

Sat, Feb 22, 2020, 03:33 PM
Andhadhun Movie
  • 'భీష్మ'తో విజయాన్ని సాధించిన నితిన్ 
  •  తదుపరి సినిమాలుగా 'రంగ్ దే'.. 'చెక్'
  • కీలక పాత్ర కోసం అన్వేషణ
చాలా కాలం తరువాత నితిన్ కి 'భీష్మ' సినిమాతో హిట్ పడింది. ఈ సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తూ, 'అంధాదూన్' సినిమా రీమేక్ కి శ్రీకారం చుట్టేపనిలో వున్నాడని అంటున్నారు. 2018లో హిందీలో వచ్చిన , 'అంధాదూన్' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా తను నటించనున్నాడు.

హిందీలో 'టబు' పాత్ర చాలా కీలకం. తెలుగులో ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ .. స్నేహ .. రెజీనా .. అనసూయల పేర్లను  పరిశీలిస్తున్నారట. వీళ్లలో నుంచే ఎంపిక ఉంటుందా? మరికొంతమంది పేర్లను ఈ జాబితాలో చేరుస్తారా? అనేది చూడాల్సి వుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగుకి చాలానే సమయం ఉండొచ్చు. ఎందుకంటే  'రంగ్ దే' .. 'చెక్' సినిమాలను పూర్తి చేసిన తరువాతనే నితిన్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళతాడు. మొత్తానికి ఈ ఏడాది అంతా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తాడన్న మాట.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement