Congress: ట్రంప్​ కు స్వాగతం చెప్పే జాబ్స్​.. అప్లై చేసుకోండి.. ప్రధాని మోదీపై కాంగ్రెస్​ సెటైర్​

  • దేశంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదంటూ ఆగ్రహం
  • రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఏమైందని నిలదీత
  • ట్రంప్ పర్యటన నేపథ్యంలో మోదీని విమర్శిస్తూ ట్వీట్లు
In Swipe At PM Congress Tweets On Jobs To Welcome Trump

దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగించిందని, నిరుద్యోగం పెరిగిపోయినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు చేసింది. అహ్మదాబాద్ లో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీలో భాగంగా 69 లక్షల ఖాళీలు రెడీ చేశారు. ట్రంప్ కు స్వాగతం చెప్పే జాబ్స్.. అప్లై చేసుకోండి” అంటూ సెటైర్ వేసింది.

ప్రత్యేకంగా పోస్టర్ రూపొందించి..

‘‘డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభినందన్ సమితి. ఉద్యోగాల కోసం ఆహ్వానిస్తోంది. చేయాల్సిన డ్యూటీలు ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చేతులు ఊపడం. 69 లక్షల ఖాళీలు ఉన్నాయి. రెమ్యూనరేషన్.. అచ్ఛేదిన్” అంటూ ప్రత్యేకంగా పోస్టర్ రూపొందించి మరీ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘జుమ్లా7మిలియన్కా’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేసింది.

దేశ ప్రతిష్ట పెరిగితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది: బీజేపీ ఫైర్

ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశాధిపతి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఇద్దరూ కలుసుకోవడాన్ని వేడుకగా చేసుకోవాల్సిందేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. దీనివల్ల దేశ ప్రతిష్ట కూడా పెరుగుతుందని, కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని తట్టుకోలేకపోతోందని విమర్శించారు.

More Telugu News