Rana: 'హిరణ్యకశిప' బడ్జెట్ ను భారీగా తగ్గించారట!

  • భారీ పౌరాణిక చిత్రంగా 'హిరణ్యకశిప'
  • టైటిల్ రోల్ లో రానా 
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు 
Hiranya Kashipa Movie

రానా కథానాయకుడిగా త్వరలో 'హిరణ్య కశిప' రూపొందనుంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ సినిమాకి దర్శకుడిగా గుణశేఖర్ వ్యవహరించనున్నాడు. బాలలతో 'రామాయణం' వంటి పౌరాణికం, 'రుద్రమదేవి'వంటి చారిత్రకం తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ సొంతం. 'హిరణ్య కశిప' కోసం ఆయన చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగుతో రంగంలోకి దిగుతున్నాడు.

ఈ సినిమాను 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. వివిధ భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉండడంతో, ఆ స్థాయిలో ఖర్చు చేయవచ్చనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఎందుకని ఇలా బడ్జెట్ లో కోత పెట్టారనే విషయంలో స్పష్టత లేదు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియదుగానీ, ఈ విషయమే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ ప్రచారం పట్ల ఈ సినిమా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

More Telugu News