Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేస్తున్న మారుతి

  • పూరి సినిమాతో బిజీగా విజయ్ దేవరకొండ 
  •  మారుతి దర్శకత్వంలో తదుపరి సినిమా  
  •  ఇటీవలే హిట్ కొట్టిన మారుతి  
Maruthi Movie

విజయ్ దేవరకొండతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. తెలుగుతో పాటు హిందీ .. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కారణంగా ఆయా భాషల్లో ఆయన మార్కెట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సహజంగానే ఆయన తదుపరి సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ్ సినిమాను పూర్తి చేసిన తరువాత ఆయన మారుతితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ మధ్య వచ్చిన 'ప్రతిరోజూ పండగే' సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక విజయ్ దేవరకొండ కోసం ఆయన తయారు చేస్తున్న కథ ఎలా ఉంటుందో చూడాలి.

More Telugu News