Vishwak Sen: రేపు హైదరాబాదులో 'హిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • యూత్ లో విష్వక్సేన్ కి మంచి ఫాలోయింగ్
  • మిస్సింగ్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  •  ఈ నెల 28వ తేదీన విడుదల  
HIT Movie

యూత్ లోను ..మాస్ ఆడియన్స్ లోను విష్వక్సేన్ కి మంచి ఫాలోయింగ్ వుంది. ఆయన కథానాయకుడిగా రూపొందిన 'హిట్' సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాదు - ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. నాని సమర్పిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా రుహాని శర్మ కనిపించనుంది. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించిన మిస్టరీ చుట్టూ ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో  రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో విష్వక్సేన్ కి హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.

More Telugu News