తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' తొలిరోజు వసూళ్లు

22-02-2020 Sat 10:51
  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'భీష్మ'
  • తొలి ఆటతోనే సక్సెస్ టాక్ 
  • వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం 
Bheeshma movie

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నితిన్ - రష్మిక జంట ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను కొట్టేసింది. తెలుగురాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 6.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 2.21కోట్ల షేర్ ను రాబట్టింది.

నితిన్ కెరియర్లో 'అ ఆ' తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'భీష్మ' నిలిచింది. ఈ రోజు .. రేపు వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన నితిన్, ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నాడట. నితిన్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని రష్మిక తన మార్కెట్ ను మరింతగా పెంచుకుంది.  సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.