జగన్​ గారూ, దివ్యాంగుల పెన్షన్ కట్ చేశారు.. సిగ్గుగా లేదా?: నారా లోకేశ్​

Fri, Feb 21, 2020, 05:00 PM
Nara Lokesh comments on Jagan
  • ఏపీలో పెన్షన్లు తొలగించడంపై నారా లోకేశ్ ఫైర్
  • జగన్ గారు ఎక్కడ ఉన్నారు? దివ్యాంగుల మొర వినండి
  • ఓ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
ఏపీలో పెన్షన్లు తొలగించడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలతో ఓ ట్వీట్ చేస్తూ, ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. అవివాహిత, వికలాంగురాలు అయిన ఆమెకు పెన్షన్ ఆపేశారని , ఈ విషయమై వాలంటీర్లను అడిగితే తాలూకాకు వెళ్లమని చెప్పారని, అక్కడికెళితే మరో చోటకు వెళ్లమని చెప్పారని.. ఎక్కడికి వెళ్లి ఎవరిని కలిసినా స్పందించడం లేదని  ఆ వీడియోలో ఓ మహిళ ఆరోపించడం కనబడుతుంది. అదే విధంగా, తనకు స్థలం ఉందని ఆరోపిస్తూ తనకు రావాల్సిన పెన్షన్ ని ఆపేశారని ఓ వృద్ధురాలి మొర ఈ వీడియోలో ఉంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad