Jammu And Kashmir: దగ్గు మందు తాగి ప్రాణాలు కోల్పోయిన 9 మంది చిన్నారులు

  • జమ్మూకశ్మీర్‌లో ఘటన
  • 17 మందికి అస్వస్థత
  • నెల రోజులుగా చికిత్స
  • దగ్గు మందు పంపిన సంస్థపై చర్యలు
nine child dies in jammukashmir

దగ్గు తగ్గడానికి మందు తాగి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ  సంస్థ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్‌ జిల్లా చిన్నారులకు పంపింది. అయితే,  'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే విష పదార్థం 'కోల్డ్ బెస్ట్ పీసీ‌' సిరప్ లో ఉంది. ఆ మందు‌ను తాగడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు.

దీంతో వారికి నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. విష పదార్థం ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ మీడియాకు తెలిపారు. ఆ మందు కారణంగా చిన్నారుల ఊపిరితిత్తులు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో సదరు సంస్థ ఉత్పత్తులను ఎనిమిది రాష్ట్రాల్లో బంద్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

More Telugu News