tiktok: అమ్మాయిలతో స్కూల్ టీచర్ల టిక్‌టాక్‌ వీడియోలు.. కలకలం!

  • కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
  • సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్
  • మండిపడుతోన్న తల్లిదండ్రులు 
teachers tiktok videos with school girls

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని-- అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు.

కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

More Telugu News