Tamilnadu: వామ్మో... ఇతని లీలలు అన్నీ ఇన్నీ కాదు... భార్యే పక్కా ప్లాన్ తో కటకటాల వెనక్కు నెట్టించింది!

  • తమిళనాడులోని తిరుచురాపల్లి సమీపంలో ఘటన
  • 40 మంది మహిళలతో రాసలీలలు
  • వీడియోలను తీసుకెళ్లి హైకోర్టు ముందు పెట్టిన భార్య
  • బెయిల్ ఇచ్చేందుకు అవకాశం లేని సెక్షన్ల కింద కేసు
Wife Proofs Secret Videos of husbend

అతని పేరు జయకుమార్. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్. బాధ్యతాయుతమైన ఉద్యోగం. కానీ బుద్ధే పెడదారి పట్టింది. రుణాల కోసమో, మరో అవసరం కోసమో తన వద్దకు వచ్చే మహిళలను లోబరచుకుని, వారితో సన్నిహితంగా గడిపి, తన స్వీయ రాసలీలల ఫొటోలు, వీడియోలను దాచుకోవడమే ఇతని ప్రవృత్తి. ఇక ఇతని ఆగడాలను గమనించిన భార్య, వీడియో ఆధారాలు సహా బట్టబయలు చేయగా, తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో జయకుమార్ సహా, అతని కుటుంబీకులంతా పరారీలో ఉన్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లాకు చెందిన ఎడ్విన్ జయకుమార్, వీరాలిమలైలో ఉన్న ఇండియన్ బ్యాంకులో క్యాషియర్. ఆయనకు గత సంవత్సరం డిసెంబర్ 2న తంజావూరు జిల్లాకు చెందిన యువతి (32)తో వివాహం అయింది. కాపురానికి వెళ్లిన ఆమె, జయకుమార్, తన ఇంట్లోని ప్రత్యేక గదిలో మహిళలతో గంటల తరబడి గడుపుతూ ఉన్నాడని, తనతో సఖ్యతగా లేడని గమనించింది. ఆపై ఓ రోజు అతని గదిలోకి వెళ్లి చూడగా, అక్కడ నమ్మలేని విషయాలు ఆమెకు బోధపడ్డాయి. 15 సెల్ ఫోన్లు, వాటిల్లో బ్యాంకు ఖాతాదారులమని చెప్పుకుని వచ్చే మహిళలతో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, బాత్ రూమ్ వీడియోలు... ఇలా ఎన్నింటినో చూసి అవాక్కైంది.

అతని ఆగడాలను కట్టించాలని భావించి, సాక్ష్యాలను సేకరించింది. జరిగిన ఘోరాన్ని అత్త, ఆడపడుచు, ఇతర బంధువుల వద్ద చెప్పుకుని విలపించింది. అయితే, వారు సమస్యను పరిష్కరించకపోగా, కుటుంబ విషయాలను బయటకు చెప్పిందంటూ గృహ హింసకు దిగారు. ఆమె స్నానం చేస్తుండగా, వీడియో తీశామని, విషయాన్ని బయటకు చెబితే, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో ఆమె విషయాన్ని తన కుటుంబీకులకు చేరవేసింది. వారు వచ్చి జయకుమార్ ను నిలదీయడంతో, కోపాన్ని పెంచుకున్న అతను, భార్యను బయటకు తీసుకెళ్లి చంపేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు.

భర్త నుంచి తప్పించుకున్న భార్య, డీజీపీని కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో, ఆయన ఆదేశాల మేరకు జయకుమార్, అతని తల్లి, సోదరి, బంధువు, దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగినిలపై కేసు నమోదైంది. ఆ వెంటనే తన పరపతిని ఉపయోగించి, మధురై హైకోర్టు బెంచ్ నుంచి జయకుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.

దీంతో అతన్ని అరెస్ట్ చేయలేమని పోలీసులు స్పష్టం చేయగా, భార్య, తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకెళ్లి, మధురై కోర్టు ముందుంచింది. అతని దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కాదని వాపోయింది. ఇక వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు, జామీనుపై విడుదల చేసేందుకు వీల్లేని సెక్షన్లు పెట్టి, తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలని సూచించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News