'ఉప్పెన'కి హైలైట్ గా నిలవనున్న ప్రీ క్లైమాక్స్

20-02-2020 Thu 18:55
  • విభిన్నమైన ప్రేమకథగా రూపొందిన 'ఉప్పెన'
  • కథానాయికగా కృతి శెట్టికి తొలి సినిమా
  • ఏప్రిల్ 2వ తేదీన భారీ విడుదల  
Uppena Movie
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయమవుతున్నాడు. ఇక కథానాయిక కృతి శెట్టికి కూడా ఇదే తొలి సినిమా. జాలరి కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. సముద్ర తీర ప్రాంతంలో జాలరుల జీవిత విధానాన్ని ప్రతిబింబిస్తూ సాగే ప్రేమకథగా ఈ సినిమా సాగనుంది.

ఈ సినిమాలో నాయకా నాయికలు ప్రేమలో పడటం వరకూ ఒక విధంగా సాగిన కథ, కథానాయిక తండ్రిగా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక రేంజ్ కి వెళుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయని చెబుతున్నారు. విలన్ గా 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.