నా రెండో సినిమాకే రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది: దర్శకుడు వెంకీ కుడుముల

20-02-2020 Thu 16:42
  • కథ వినగానే నితిన్ ఓకే అన్నాడు 
  •  రష్మిక డేట్స్ ఇవ్వడం విశేషం 
  •  ఆమెకి మరో హిట్ ఖాయమన్న దర్శకుడు  
Bheeshma Movie

వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఛలో' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, మరో ప్రేమకథను సిద్ధం చేసుకుని, 'భీష్మ' టైటిల్ తో రూపొందించాడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లో వెంకీ కుడుముల మాట్లాడుతూ .. "కథ వినగానే నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథపై నాకు మరింత నమ్మకం పెరిగింది. నా మొదటి సినిమా 'ఛలో' చేసేటప్పటికీ రష్మికకి ఎలాంటి క్రేజ్ లేదు. ఆమెను దృష్టిలో పెట్టుకునే 'భీష్మ'లో కథానాయిక పాత్రను రాసుకున్నాను. అయితే ఈ లోగా రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఈ సినిమా చేస్తుందా లేదా అనే సందేహం వచ్చింది. బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ ఇచ్చి ఆమె సహకరించడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాతో ఆమెకి మరో హిట్ దక్కడం ఖాయమనే నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చాడు.