Nithin: 'పవర్ పేట' కోసం మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న నితిన్

  • రేపు విడుదల కానున్న 'భీష్మ'
  • తదుపరి సినిమాగా 'పవర్ పేట'
  • దర్శకుడిగా కృష్ణ చైతన్య
Power Peta Movie

నితిన్ 'భీష్మ' సినిమాతో రేపు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. పాటల రచయితగా పరిచయమైన కృష్ణ చైతన్య, ఆ తరువాత దర్శకుడిగా మారి చేసిన 'ఛల్ మోహన్ రంగా' అంతగా ఆదరణ పొందలేదు. అయినా ఆయనకి మరోసారి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల కుర్రాడిగా .. 40 ఏళ్ల యువకుడిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడట. ఈ కథలో చాలా విషయం ఉందనీ, అందువలన రెండు మూడు భాగాలుగా తమ బ్యానర్లోనే చేయనున్నామని నితిన్ స్వయంగా చెప్పాడు. ఇంతవరకూ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన నితిన్, ఈ సారి ప్రయోగాత్మక చిత్రాన్ని చేయడానికి సాహసించడం విశేషం.

More Telugu News