Vijay Devarakonda: అయోమయంలో పడేస్తున్న విజయ్ దేవరకొండ 'హీరో'

  • కొంతకాలం క్రితం సెట్స్ పైకి వెళ్లిన 'హీరో'
  • 50 కోట్లను కేటాయించిన నిర్మాతలు 
  • కొన్ని రోజుల పాటు జరిగిన షూటింగ్
Hero Movie

విజయ్ దేవరకొండ ఆ మధ్య వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళ్లాడు. వాటిలో ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక సినిమా మాత్రం ఆయన అభిమానులను అయోమయంలో పడేసింది .. ఆ సినిమా పేరే 'హీరో. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు ఆనంద్ అన్నామలై  కొంతకాలం క్రితం 'హీరో' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ, ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. తాత్కాలికంగా వాయిదా వేశారా? లేదంటే పూర్తిగా పక్కన పెట్టేశారా? అనే విషయంలోనే అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News