Samantha: అందుకే ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాను: సమంత

  • విజయ్ సేతుపతి హీరోగా 'కాత్తువక్కుల రెందు కాదల్'
  • విభిన్న కథల కోసం తాను ఎదురుచూస్తున్నానన్న సమంత
  • ఆ సమయంలో తన వద్దకు ఈ ఆఫర్ వచ్చిందని వ్యాఖ్య 
  • ఒక సవాలుగా భావించానన్న సమంత
samantha about her new movie

విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం 'కాత్తువక్కుల రెందు కాదల్' సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత పలు విషయాలు తెలిపింది.

ఆసక్తికర, విభిన్న కథల కోసం తాను ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని చెప్పింది. నయనతార, విజయ్ సేతుపతి పక్కన ఉత్తమంగా నటించడం ఒక సవాలుగా భావించానని తెలిపింది. ఈ కారణాల వల్లే తాను ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పానని వెల్లడించింది.

More Telugu News