Shivakasi: శివకాశిలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు.. నలుగురి దుర్మరణం

  • తీవ్రంగా గాయపడిన మరో 8 మంది
  • పరారీలో కర్మాగార యజమాని
  • పేలుడుకు గల కారణాల అన్వేషణలో పోలీసులు
Blast in fire works company in sivakasi

తమిళనాడు, శివకాశీ సమీపంలోని ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కూలీలు కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కర్మాగారం యజమాని కోసం గాలిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

More Telugu News