ఉద్యోగులకు ఈ ఏడాది వేతనాల పెంపు తక్కువేనట!

19-02-2020 Wed 21:31
  • అవోన్ శాలరీ ఇంక్రీజ్ సర్వేలో బయటపడిన చేదు నిజం
  • ఈ దశాబ్దంలోనే అతి తక్కువగా పెరగనున్న వేతనాలు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం మాత్రమే హైక్
Salary hikes in 2020 lowest in a decade
దేశంలోని వేతన జీవులకు ఇది నిరాశ కలిగించే వార్తే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ దశాబ్దంలోనే అత్యంత తక్కువగా వేతనాలు పెరగనున్నాయట. ‘అవోన్ శాలరీ ఇంక్రీజ్ సర్వే 2020’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున 9.1 శాతం మేర జీతాలు పెరగనున్నాయి. 2009 తర్వాత ఇంత కనిష్ట స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో 6.6 శాతం మాత్రమే పెరగ్గా ఈసారి 9.1 శాతం పెరగనున్నాయి.

అప్పటితో పోలిస్తే కొంత మెరుగే అయినప్పటికీ ఈ దశాబ్దంలో మాత్రం ఇదే కనిష్టం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండేళ్లు 10.4 శాతం చొప్పున వేతనాలు పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి 2019 నాటికి 9.3 శాతానికి చేరాయి. ఈసారి ఇంకా తక్కువగా 9.1 శాతం మాత్రమే పెరగనున్నట్టు సర్వే వెల్లడించింది.