Arvind Kejriwal: ఒక్క మంత్రిత్వ శాఖను కూడా తీసుకోని కేజ్రీవాల్​.. కారణం చెప్పిన ఢిల్లీ సీఎం!

  • 2017 నుంచి ఒక్క జల వనరుల శాఖనే చూసిన కేజ్రీవాల్
  • అంతకు ముందు కూడా ఏ శాఖనూ తీసుకోలేదు 
  • ఇప్పుడూ ఏ శాఖ కూడా తీసుకోనని చెప్పిన ఢిల్లీ సీఎం
Arvind Kejriwal Has Refused To Take Any Ministry

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక్క మంత్రిత్వ శాఖను కూడా తన అధీనంలో ఉంచుకోలేదు. అన్ని శాఖలనూ మంత్రులకే అప్పగించేశారు. ఇటీవలి వరకు చూసుకున్న జల వనరుల శాఖను కూడా ఈసారి వేరే మంత్రికి అప్పగించేశారు. ఇదేమిటని మీడియా అడిగితే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

ఆ బాధ్యత కోసం వీటికి దూరం

ఒక్క మంత్రిత్వ శాఖను కూడా మీ పరిధిలో ఎందుకు ఉంచుకోలేదని చాలా మంది తనను అడుగుతున్నారని, ఢిల్లీ ప్రజలకు వీలైనంతగా అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని, అదే తన ఫస్ట్ చాయిస్ అని తెలిపారు. అందుకే ఏ మంత్రిత్వ శాఖను కూడా తన అధీనంలో ఉంచుకోలేదన్నారు.

‘‘నా పరిధిలో ఏ మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడంతో.. అన్ని శాఖలపైనా ఓ కన్నేసి ఉంచడానికి నాకు వీలవుతుంది. ఏదైనా ఒక శాఖ బాధ్యతలు నాపై ఉంటే.. దానిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. మిగతా వాటి విషయంగా ఇబ్బంది ఎదురవుతుంది” అని కేజ్రీవాల్ చెప్పారు.

మొదటి నుంచీ ఇంతే..

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా గెలవడం ఇది మూడోసారి. మొదటి సారి కొన్ని నెలల పాటు పాలించిన సమయంలో కూడా ఆయన ఏ ప్రభుత్వ శాఖను తన పరిధిలో ఉంచుకోలేదు. రెండోసారి గెలిచాక కూడా కొన్ని నెలల పాటు అలాగే ఉన్నారు. ఇంటింటికీ తక్కువ రేటుకు సురక్షిత మంచినీరు అందిస్తానన్న హామీ మేరకు ఆ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. 2017 నుంచి ఒక్క జల వనరుల శాఖను మాత్రం తాను నిర్వహించారు. ఈసారి గెలిచాక ఆ శాఖను కూడా తీసుకోలేదు.

More Telugu News