ఏపీకి బీజేపీ చేసిన మోసం, ద్రోహం మరే పార్టీ చేయలేదు: తులసిరెడ్డి

19-02-2020 Wed 15:14
  • హోదాకు పంగనామం పెట్టారని విమర్శలు
  • గాంధేయ వాదానికి, గాడ్సే వాదానికి మధ్య పోరాటం జరుగుతోందని వెల్లడి
  • అంతిమ విజయం గాంధేయ వాదానిదేనని వ్యాఖ్యలు
AP Congress working president Tulasi Reddy slams BJP

ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహం, మోసం మరే పార్టీ చేయలేదని అన్నారు. హోదాకు పంగనామం పెట్టారని, విభజన హామీలు అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో గాంధేయ వాదానికి, గాడ్సే వాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోందని అన్నారు. అంతిమ విజయం గాంధేయ వాదానిదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ఏపీ శాసనమండలి రద్దు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మండలి రద్దు తీర్మానం వైఎస్ కు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. కక్షపూరితంగా, అహంకారంతో మండలి రద్దు తీర్మానం చేశారని విమర్శించారు.