Vishwak Sen: ఆసక్తిని రేకెత్తిస్తున్న 'హిట్' ట్రైలర్

  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో విష్వక్సేన్
  • ఈ నెల 28వ తేదీన విడుదల
HIT Movie

ఇటీవల కాలంలో తెలుగు తెరను క్రైమ్ థ్రిల్లర్ కథలు ఎక్కువగా పలకరిస్తున్నాయి. ఈ తరహా సినిమాలకి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అదే తరహాలో మరో సినిమా రూపొందింది .. ఆ సినిమా పేరే 'హిట్'. విష్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, శైలేశ్ కొలను దర్శకుడిగా వ్యవహరించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమాను నాని సమర్పిస్తున్నాడు. రుహని శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ట్రైలర్ తో మరింతగా ఆసక్తి పెరిగేలా చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.

More Telugu News