Junior NTR: త్రివిక్రమ్ సినిమాలో పక్కింటి అబ్బాయిగా ఎన్టీఆర్

  • త్రివిక్రమ్ తో మరోసారి ఎన్టీఆర్ 
  • జూన్ లో సెట్స్ పైకి 
  • నిర్మాణ భాగస్వామిగా కల్యాణ్ రామ్
Trivikram Movie

ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలోగానీ, త్రివిక్రమ్ దర్శకత్వంలోగాని చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ చేయనున్నట్టు సమాచారం. 'అరవింద సమేత'లో ఎన్టీఆర్ ను కొత్త కోణంలో చూపించిన త్రివిక్రమ్, ఈ సినిమాలో ఆయనను పక్కింటి అబ్బాయి పాత్రలో చూపించనున్నాడని అంటున్నారు.

ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన ఈ కథపైనే త్రివిక్రమ్ కసరత్తు మొదలుపెట్టాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. హారిక అండ్ హాసినివారితో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి, కల్యాణ్ రామ్ అంగీకరించాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సినిమా తరువాత వెట్రిమారన్ తో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండొచ్చు.

More Telugu News