Chiranjeevi: చిరూ సినిమా నుంచి తప్పుకున్న చరణ్ .. తెరపైకి బన్నీ?

  • చిరూతో కొరటాల తాజా చిత్రం
  • సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం 
  • ఉత్సాహాన్ని చూపుతున్న అల్లు అర్జున్ 
Koratala Siva Movie

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా ఇది నిర్మితమవుతోంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్రను చరణ్ చేసే అవకాశం లేదనేది తాజా సమాచారం.

రాజమౌళి సినిమా షరతుల ప్రకారం, 'ఆర్ ఆర్ ఆర్' పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టును అంగీకరించకూడదు, ఆ సినిమాకి ముందు .. చరణ్ చేసిన మరో సినిమా విడుదల కాకూడదట. అందువల్లనే కొరటాల సినిమాలో చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. చరణ్ చేయాలనుకున్న ఆ పాత్రకు అల్లు అర్జున్ అయితే బాగుంటాడనే అభిప్రాయాన్ని కొరటాల వ్యక్తం చేశాడట. ఆ పాత్రను చేయడానికి అల్లు అర్జున్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.

More Telugu News