Mohan Babu: మంచు వారి బ్యానర్ నుంచి వెబ్ సిరీస్ గా ఎన్టీఆర్ జీవితచరిత్ర?

  • మంచు విష్ణు నుంచి వెబ్ సిరీస్
  • దర్శకుడిగా రాజ్ అనంత 
  • ప్రధాన పాత్రలో హీరో శ్రీకాంత్
Chadarangam Web Series

ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమవుతున్న కారణంగా 'చదరంగం' అనే టైటిల్ ను ఖరారు చేశారట.

ఎన్టీ రామారావుని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆయనకి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు. అందువలన ఈ వెబ్ సిరీస్ కి కథా సహకారాన్ని మోహన్ బాబు అందించారని అంటున్నారు. రాజ్ అనంత ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీ రామారావు పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.

More Telugu News