కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ మృతి

18-02-2020 Tue 20:49
  • చెన్నైలో తుదిశ్వాస విడిచిన వీఎల్ దత్
  • కేసీపీ పరిశ్రమలతో సుప్రసిద్ధుడైన దత్
  • ప్రపంచ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తింపు

దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ కన్నుమూశారు. ఆయన చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. వీఎల్ దత్ గా సుప్రసిద్ధుడైన ఆయన కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో పరిశ్రమలు స్థాపించారు. పంచదార, సిమెంట్ ఉత్పత్తికి కేసీపీ పేరుగాంచింది. వీఎల్ దత్ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ప్రపంచ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు. ఫిక్కీ, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.