ఏపీ శాసనమండలి వ్యవహారాలను గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన చైర్మన్​ షరీఫ్​!

18-02-2020 Tue 19:47
  • సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారంపై ప్రస్తావన
  • చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎప్పుడూ జరగలేదన్న షరీఫ్
  • ఈ విషయమై  గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం
Ap legislative council chairman Sharif meets Governor Biswa Bhushan

ఏపీ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ తో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సమావేశమయ్యారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయమై జరిగిన వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, రూలింగ్ అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనకు ఉన్న విశేషాధికారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, చైర్మన్ నిర్ణయాన్ని కార్యదర్శి వ్యతిరేకించడం ఇప్పటివరకూ జరగలేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.