టీడీపీ ప్రజాచైతన్య యాత్ర కరపత్రం విడుదల చేసిన కళావెంకట్రావు

Tue, Feb 18, 2020, 05:13 PM
TDP leader kala venkat rao releases Prajachaitanya Yatra palm plate
  • వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
  • తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచింది
  • J-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోంది
రేపు ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా  ప్రజా చైతన్య యాత్ర కరపత్రంను టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.

వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని , ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha