Ghost of Mountain: 'ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్ ఇదే'... ఇండియాలో కనిపించిన మంచు చిరుత... వీడియో ఇదిగో!

  • హిమాచల్ ప్రదేశ్ లో దట్టంగా కురుస్తున్న మంచు
  • పర్వతాల నుంచి కిందకు దిగిన మంచు చిరుత
  • అరుదైన వీడియో కావడంతో వైరల్
Ghost of Leopard Seen in Himachal Pradesh

'ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి. ఈ చిరుత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని స్పిటి జిల్లా హిక్కిం గ్రామంలో మంచులో ఠీవీగా నడుస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి. కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఇక ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయని చెబుతూ అటవీ శాఖ అధికారి సుశాంతా నందా దీని వీడియోను షేర్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మంచు చిరుతను చూసిన వారంతా, అరుదైన వీడియోను చూపించారని కితాబిస్తున్నారు. వేలకొద్దీ లైక్ లను, వందల కొద్దీ రీ ట్వీట్ లను ఇది తెచ్చుకుంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసినప్పుడు, హిమాలయ పర్వతాల నుంచి కిందకు దిగే ఈ చిరుతలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయని స్థానికులు వెల్లడించారు.

More Telugu News