Viral Videos: విపరీతంగా వైరల్ అవుతోన్న నలుగురు కుర్రాళ్ల డ్యాన్స్ వీడియో ఇది!

  • సాగర తీరాన డ్యాన్స్‌
  • విభిన్నంగా స్టెప్పులు
  • నెటిజన్ల ప్రశంసల జల్లు
This Viral Dance Video Has A Twist In The End Thats Confusing Everyone

సాగర తీరాన.. సంధ్యా సమయాన నలుగురు కుర్రాళ్లు చేసిన డ్యాన్స్‌ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. తమలోని ప్రతిభను బయటపెడుతూ వారు విభిన్నంగా చేసిన ఈ డ్యాన్స్‌ను నెటిజన్లు పదే పదే చూస్తున్నారు. ఇలా డ్యాన్స్‌ చేయడం ఎలా సాధ్యమైంది? అనేలా ఎవరికీ అర్థం కాని విధంగా వారు స్టెప్పులు వేశారు.

ముక్కాబులా అనే పాటకు విభిన్నంగా చేతులు, కాళ్లు కదుపుతూ వారు ఇలా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను వారు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కాసేపటికే చాలా మంది చూశారు. రాత్రికి రాత్రే వారు స్టార్లు అయిపోతున్నారు. ఈ డ్యాన్సులో చివరకు ఓ కుర్రాడు తన తలను పూర్తిగా వెనక్కి తిప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా డ్యాన్స్‌ చేయొచ్చన్న ఆలోచన ప్రభుదేవా లాంటి వారికి రాదంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారు ముంబైలో ఈ డ్యాన్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

More Telugu News