Anjali: 'ఆనందభైరవి' కోసం అంజలి, రాయ్ లక్ష్మి మధ్య ఫైట్

  • షూటింగు దశలో 'ఆనందభైరవి'
  • ప్రధాన పాత్రల్లో అంజలి - రాయ్ లక్ష్మి  
  • తెలుగు - తమిళ భాషల్లో విడుదల
Ananda Bhairavi Movie

తెలుగు .. తమిళ భాషల్లో అంజలి - రాయ్ లక్ష్మి ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది. ఇద్దరూ కూడా ఈ మధ్య కాలంలో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తూ వెళుతున్నారు. అలాంటి ఈ ఇద్దరూ 'ఆనందభైరవి' సినిమాలో కలిసి నటిస్తున్నారు. కథ అంతా కూడా ఈ ఇద్దరి చుట్టూనే తిరుగుతుంది. తిరుపతి రెడ్డి - రమేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.

కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో జరుగుతోంది. అంజలి - రాయ్ లక్ష్మి కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా యాక్షన్ సీన్స్ లో నువ్వా .. నేనా అన్నట్టుగా చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఈ ఇద్దరి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.

More Telugu News