మూడు రాజధానుల పేరిట భారీ మోసం: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

18-02-2020 Tue 10:24
nara lokesh allegations against jagan
  • 9 నెలల తుగ్లక్ పాలనలో ప్రజలకు ఎన్ని కష్టాలో
  • ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది 
  • రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది
  • 19 నుండి ప్రజా చైతన్య యాత్ర 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. '9 నెలల తుగ్లక్ పాలనలో ప్రజలకు ఎన్ని కష్టాలో! వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఇబ్బందుల ఊబిలో కూరుకుపోతున్న ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి 19 నుండి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తుంది' అని లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

'మూడు రాజధానుల పేరిట భారీ మోసం.. ఇటు అమరావతిలో రైతులకు అన్యాయం చేశారు. అటు విశాఖపట్నంలో దోపిడీకి సిద్ధమయ్యారు' అంటూ ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని అందులో తెలిపారు.