Corona Virus: 40 ఏళ్ల నాటి నవలలో కరోనా ప్రస్తావన... కాకతాళీయమేనా?

  • 1981లో వచ్చిన ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్
  • అందులో వుహాన్-400 వైరస్ గురించి వివరణ
  • ఇప్పుడు వుహాన్ లోనే మొదలైన కరోనా వైరస్
An American novel excerpts Corona like virus 40 years ago

ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ను పోలిన ప్రమాదకర వైరస్ గురించి 40 ఏళ్ల కిందటే ఓ నవలలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నవల పేరు ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్. కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. అమెరికాకు చెందిన డీన్ కూంట్జ్ దీని రచయిత.

ఆ నవలలో... వుహాన్-400 అనే వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు జీవాయుధంగా రూపొందిస్తారు. శత్రుదేశాలపై యుద్ధాల్లో ఉపయోగించేందుకు ఈ జీవాయుధాన్ని చైనా సిద్ధం చేస్తుంది. ఓ మిలిటరీ ప్రయోగశాలలో ఈ వుహాన్-400 వైరస్ ను సృష్టిస్తారు. ఇది మనుషులపై విపరీతమైన ప్రభావం చూపుతుందని, దీన్ని ప్రయోగించడం ద్వారా కొన్ని దేశాలను తుడిచిపెట్టవచ్చని ఆ నవలలో పేర్కొన్నారు.

తాజాగా ఓ నెటిజన్ ఈ నవలలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కరోనా వైరస్ మొదలైన ప్రాంతం కూడా వుహాన్ కావడంతో ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. అయితే చాలామంది ఇది కాకతాళీయం కావొచ్చని అంటున్నారు. నవలలో పేర్కొన్న వైరస్ సోకితే బతకడం అంటూ ఉండదు. దానితో పోలిస్తే కరోనా తీవ్రత తక్కువేనని, బతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

More Telugu News