Airtel: కేంద్రానికి రూ. 10 వేల కోట్లు కట్టిన ఎయిర్ టెల్!

  • మొత్తం రూ. 35,586 కోట్ల బకాయి
  • మిగతా మొత్తాన్ని స్వీయ మదింపు తరువాత చెల్లిస్తాం
  • ఓ ప్రకటనలో వెల్లడించిన ఎయిర్ టెల్
Ten Thousand Crores paid by Airtel

ప్రముఖ మొబైల్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ కేంద్రానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో రూ. 10 వేల కోట్లను చెల్లించింది. స్వీయ మదింపు తరువాత మిగతా బకాయిలను చెల్లిస్తామని పేర్కొంది. బకాయిల చెల్లింపునకు డెడ్ లైన్ దాటిపోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే టెలికం సంస్థలను మందలించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ సంస్థ భారతీ ఎయిర్ టెల్, భారతీ హెక్సాకామ్, టెలినార్ తరఫున ఈ డబ్బులు చెల్లించామని, సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరిగేలోగా మిగతా బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పాత బకాయిలను తక్షణం చెల్లించాలని ఈ నెల 14న ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్ టెల్ మొత్తం రూ. 35,586 కోట్ల బకాయి ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News