తెలుగులో భారీగా విడుదల కానున్న ధనుశ్ మూవీ

17-02-2020 Mon 12:17
  • కార్తీక్ సుబ్బరాజ్ నుంచి మరో విభిన్న కథా చిత్రం
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ధనుశ్ 
  • కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి
Karthik Subbaraj Movie

ధనుశ్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ఒక విభిన్నమైన చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ కనిపించనున్నాడు. డిఫరెంట్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ వారు .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ గా వ్యవహరించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ధనుశ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోవడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.