Balakrishna: ఇంట్రెస్టింగ్ లైన్ తో బాలయ్య సినిమా.. సెట్స్ పైకి వెళుతున్న బోయపాటి

  • బాలకృష్ణ హీరోగా బోయపాటి సినిమా
  • నవగ్రహాల నేపథ్యంలో సాగే కథ  
  •  'అఘోర'గా కనిపించనున్న బాలకృష్ణ
Boyapati Next Movie

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ ఏమై ఉంటుంది? .. ఎలాంటి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నాడు? అనే ఆత్రుత అందరిలోను కనిపిస్తోంది. ఈ రెండు విషయాలకి సంబంధించి ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

నవగ్రహాలు .. అవి మనుషులపై చూపే ప్రభావంతో ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన ఎపిసోడ్లో బాలకృష్ణ 'అఘోర'గా కూడా కనిపిస్తాడని చెబుతున్నారు. బాలకృష్ణ అఘోర లుక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వరుస పరాజయాలతో ఉన్న బాలకృష్ణ, ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో ఉన్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించే హీరోయిన్స్ ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.

More Telugu News