Japan Ship: 40 మంది అమెరికన్లకు కోవిడ్-19... వారిని రానివ్వబోమన్న అధికారులు!

  • జపాన్ నౌకలో 400 మంది అమెరికన్లు
  • వైరస్ సోకిన వారు నౌకకే పరిమితం
  • మిగతా వారి కోసం ప్రత్యేక విమానం
40 Americans Confirm Corona Positive

జపాన్ నౌకలో ఉన్న 40 మంది అమెరికా జాతీయులకు ప్రాణాంతక కరోనా వైరస్ సోకిందని, వారెవరినీ ప్రస్తుతానికి యూఎస్ లో కాలుమోపనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నౌకలో మొత్తం 400 మందికి పైగా అమెరికన్లు ఉండగా, వారిని యూఎస్ కు తీసుకుని వెళ్లేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానం చేరుకుంది. అయితే, కొవిడ్ - 19 సోకిన వారిని మాత్రం అక్కడే ఉంచనున్నట్టు స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,770కి చేరుకుంది. తాజాగా, నిన్న మరో 105 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 70 వేలకు పైగానే ఉండగా, దాదాపు 11 వేల మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయినట్టు చైనా అధికారులు వెల్లడించారు. ఇక తైవాన్ లో 20 మందికి వైరస్ సోకగా, ఒకరు మరణించారు. మకావులో 10 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. 

More Telugu News