సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-02-2020 Mon 07:36
  • పెళ్లిళ్లు అయిపోతున్నాయంటున్న రష్మిక 
  • పూర్తి శాకాహారిగా మారిపోయిన రకుల్ 
  • సీక్వెల్ చేస్తున్న ప్రశాంత్ వర్మ
Rashmika says her heroes getting married if she acts together with any bachelor hero

 *  తాను బ్రహ్మచారి హీరోలతో నటిస్తే కనుక వాళ్లకి ఆ వెంటనే పెళ్లయిపోతోందని అంటోంది హీరోయిన్ రష్మిక. 'అవును, ఆమధ్య కన్నడలో ఓ హీరోతో చేశాను. ఆ వెంటనే అతనికి పెళ్లయిపోయింది. ఇప్పుడు నితిన్ తో భీష్మ చేశాను. ఇతనికీ పెళ్లయిపోతోంది' అని చెప్పింది నవ్వుతూ.    
*  మొన్నటివరకు పక్కా మాంసాహారి అయిన అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పూర్తి శాకాహారిగా మారిపోయింది. 'ఒకరోజు వేగాన్ (పాలు, నెయ్యి వంటి జంతు సంబంధిత ఉత్పత్తులు కూడా తీసుకోరు) గా మారిపోవాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు శరీరం తేలికగా, ఫుల్ ఎనర్జిటిక్ గా అనిపిస్తోంది' అని చెప్పింది. విదేశాలకు షూటింగులకు వెళ్లినప్పుడు తన టీమ్ శాకాహార ఆహారాన్ని తన కోసం తయారుచేస్తుందని చెప్పింది.  
*  గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని 'ఆ..' చిత్రాన్ని నిర్మించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ఆ.. చిత్రానికి సీక్వెల్ చేస్తున్నానని, త్వరలో సెట్స్ కి వెళతామని, పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు.